Header Banner

ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! వేల ఉద్యోగాల లక్ష్యంగా ఆ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి! మరిన్ని వివరాలు..

  Tue Apr 22, 2025 17:44        Politics

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రామ్మోహన్ నాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. జీఎంఆర్ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే 71 శాతం పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు అనుసంధానం చేస్తూ రోడ్లు వేస్తున్నారు. ఈ విమానాశ్రయం పూర్తయితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు ఎయిర్‌పోర్టుల్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఈ మేరకు కొత్త ఎయిర్‌పోర్టులపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్ా అయితే విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఈ పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు పనులను గమనిస్తున్నారు. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 5,050 మంది కార్మికులు, సిబ్బంది, ఇంజనీర్లు పనిచేస్తున్నారు.

విభజన హామీల్లో భాగంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. భోగాపురం విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరి 14న అప్పటి మఉక్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనుల్లో వేగం తగ్గింది.. మళ్లీ 2023 మే 3న గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు.. అయినా సరే పెద్దగా పనులు జరగలేదనే విమర్శలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..


2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి పనుల గురించి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం 2,200 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని 500 ఎకరాలను పర్యాటకం కోసం ఉపయోగించాలని యోచిస్తోంది.

ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఆ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు స్వస్థలం విజయనగరం కావడంతో మరింత శ్రద్ధతో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 71 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ భోగాపురం విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు అనుసంధానం చేసేలా రోడ్లు వేస్తున్నారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల మీదుగా అరకు వెళ్లే రహదారిని, విజయనగరం మీదుగా పార్వతీపురం వెళ్లే రహదారులను కలుపుతున్నారు. ఒడిశాలోని హడ్డుబంగి నుంచి పాలకొండ మీదుగా విజయనగరం కొత్తపేట రింగురోడ్డు వరకు రోడ్డును విస్తరిస్తున్నారు. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారులను కూడా కలుపుతున్నారు. విశాఖ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు రోడ్డును నిర్మించనున్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్లు వేస్తున్నారు.

ఈ విమానాశ్రయం పూర్తయితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. బీచ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ముంబై, గోవా, చెన్నై తరహాలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది.
ఎయిర్‌పోర్టు సిబ్బంది కోసం ఇళ్లను నిర్మిస్తున్నారు. రామచంద్రపేట దగ్గర విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి కోసం చంపావతి నది నుంచి పైపులైన్ వేస్తున్నారు. ఇక్కడ ఏకంగా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉంది. విమానాలు సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయవచ్చు. విమాన ప్రయాణికులకు సముద్ర అందాలు కనువిందు చేస్తాయి. పైనుంచి చూస్తే ఈ విమానాశ్రయం చేప ఆకారంలో కనిపిస్తుంది. పక్కల నుంచి చూస్తే ఎగిరే విమానంలా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా లోపలి డిజైన్ ఉంటుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #bhoghapuram #airport #Gateway #71%complete